గారడి వేషాలతో బీరప్ప కల్యాణోత్సవం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలో చిక్లి గ్రామంలో కుర్మా కులస్థుల ఆరాధ్య దైవమైన బీరప్ప కళ్యాణోత్సవ కార్యక్రమం ఘనంగా మంగళవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా బీరయ్య కామరాతులకు, అక్క మహంకాళి కి పట్టు వస్త్రాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. వేలాదిగా భక్తజనం హాజరై పసుపు బండారులతో పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ ప్రకారం గ్రామంలోని కులస్తులు ఇంటికి ఒక్క పొట్టేలు చొప్పున వారికి బలిచ్చి గావులతో , కడలు బోనాలతో కల్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించి, తదుపరి కార్యక్రమాలు నాగవెల్లి గారడీ వేషాలతో బీరప్ప కళ్యాణోత్సవ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో కుర్మ కుల పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.
Spread the love