బీర్ల ఐలయ్య లకు  మంత్రి పదవి ఇవ్వాలి…

– చందుపట్ల మాజీ సర్పంచ్ చిన్నం శ్రీనివాస్ …
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని చందుపట్ల మాజీ సర్పంచ్ చిన్నం శ్రీనివాస్ కోరారు. సోమవారం భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో  బీరప్ప దేవాలయం ఆవరణంలో సోమవారం  చందుపట్ల కురుమ కులస్తుల ముఖ్యుల సమావేశం ఏర్పాటు ఆయన హాజరై మాట్లాడారు.   కష్టపడి సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యే వరకు ఎదిగిన బీర్ల ఐలయ్య కి మంత్రి పదవి ఇవ్వాలని, బీసీల ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య  కి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ సుబ్బులు బీరప్ప కురుమ సంఘం అధ్యక్షులు సుబ్బులు జాంగిర్, చిన్నం బీరప్ప కంకల ఐలయ్య, కంకాల సాయిలు, సుబ్బురు.పాండు బచ్చు శ్రీనివాస్, తోటకూర మల్లయ్య, చిన్నం ఆంజనేయులు, నరేష్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
Spread the love