ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేసిన బిర్సాముండ

Birsamunda who fought for the rights of tribalsనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
భగవాన్ బిర్సముండా యుక్త వయసులోనే ఆదివాసీల  హక్కుల కోసం పోరాటాలు చేశారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం బీర్సా ముండా జయంతిని పురస్కరించుకొని హీరాసుక ఆదివాసి జాగృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని బీర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బీర్సముండా పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని తమ హక్కుల కోసం ఉద్యమించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆదివాసి పోరాటయోధుల విగ్రహాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హీరాసుక జాగృతి సమితి అధ్యక్షుడు సిడం రామ్ కిషన్, సమితి సభ్యులు, బిజెపి నాయకులు అకుల ప్రవీణ్, రఘుపతి, శివ పాల్గొన్నారు.
Spread the love