ఘనంగా కాంగ్రెస్ యువ నాయకుడు నాగరాజు జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లోని నాగార్జునసాగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు పగడాల నాగరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు గుంటుక వెంకట్ రెడ్డి,రామకృష్ణారెడ్డి,ఉంగరాల శ్రీను,హనుమంత రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ భాను ,ముజీబ్ మరియు కార్యకర్తలు తదితరులున్నారు.
Spread the love