రాజన్న ఆలయం ముందు బీజేపీ నేతల నిరసన..

BJP leaders protest in front of Rajanna temple..నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు బుధవారం బిజెపి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ బిజెపి అధ్యక్షుడు ,20వ వార్డు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కోడెలు అక్రమ తరలింపు విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదని మొన్నటి రోజున  ఈవో చెప్పడం, నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఎవరికి సిఫారసు చేయలేదని స్వయాణ దేవదాయ శాఖ మంత్రి చెప్పడం చెప్పడంలో నిజం లేదని మండిపడ్డారు. మంగళవారం రోజున మాదాసు రాంబాబు అనే వ్యక్తి పై గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం అక్కడి పోలీస్ విచారణలో తను వేములవాడ దేవాలయం నుండి కోడేలు తెచ్చుకున్నానని వెల్లడించాలని తెలిపారు. స్వయానా దేవదాయ శాఖ మంత్రి సిఫారసు లేక పై వారి అనుచరుడైన మాదాసు రాంబాబు 66 కోడెలను అక్రమంగా తీసుకెళ్లడం దానిలో దాదాపు 28 కోడేలు గోవదశాలకు అమ్ముకోవడం ఇలాంటి సంఘటన చాలా హేయమైన సంఘటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఇలాంటి సంఘటనకు పాల్పడినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని,  సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యంగా ఉన్న బాధ్యులైన దేవాలయ అధికారులకు సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని  భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. అదేవిధంగా సంబంధం లేదు అని చెప్పినటువంటి దేవాదాయ శాఖ  మంత్రి ఇచ్చినటువంటి సిఫారసు లెటర్ వల్లనే కోడెలను తరలించాలని అన్నారు.   ప్రభుత్వం వెంటనే పూర్తి విచారణ జరిపి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను హిందువుల మనోభావాలను భక్తుల మనోభావాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో  గుడిసె మనోజ్, రేగుల రాజకుమార్, నామాల శేఖర్, కోరెపు నరేష్, ఖమ్మం పృథ్వీరాజ్, బండి నరేష్, కోరేపు వెంకటేష్, శ్రావణ్, నగేష్ తో పాటు బిజెపి నాయకులు ,కార్యకర్తలు ఉన్నారు.
Spread the love