– ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన బీజేపీ వాటిని అమలు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి ఏమీ చేయలేకపోయారని తెలిపారు. సోమ వారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతలు, రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను కేంద్రానికి పంపిస్తే ఎందుకు మద్ధతి వ్వలేదని ప్రశ్నించారు. బలం లేకున్నా హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజ కవర్గ ఎమ్మెల్సీ పోటీలో బీజేపీ ఎందుకు బరిలో దిగింది. మహబూబ్‌నగర్‌లో కొంత బలం ఉన్నా ఎందుకు పోటీ నుంచి దూరం ఉందని ప్రశ్నించారు.