అవినీతి బురదలో చిక్కుకున్న బీజేపీ: పల్లా వెంకటరెడ్డి

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో బీజేపీ పార్టీ  అవినీతి బురదలో చిక్కుకుందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయం ధర్మ బిక్షం భవన్ లో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశ0లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ఫండు పేరుతో సాగించిన మనీ ల్యాండరింగ్ సహా సకల అక్రవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, రూ.100 కోట్ల రూపాయల టర్నోవర్ కూడా లేని కంపెనీ  రూ.200 కోట్లు ఫండు ఇచ్చినట్టు, అసలు కంపెనీకి సొంత వెబ్సైట్ కూడా లేని వాళ్ళు రూ.125 కోట్లు పండ్లు ఇచ్చినట్లు, చివరకు ఏటా రూ.330 కోట్లు నష్టాలు చూపుతున్న ఎయిర్టెల్ కంపెనీ బీజేపీకి రూ.300 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్లు చెల్లించినట్లు బయటపడిందని ఆయన అన్నారు. దేశంలో బీజేపీతో పాటు అనేక పార్టీలు టీడీపీ, జనసేన, టీ ఎం సీ  పార్టీలు కూడా అవినీతి బురదలో కూరుకుపోయాయని, దేశంలో అవినీతి లేని, కళంకం లేని పార్టీలు ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిస్టు పార్టీ మాత్రమే అని ఆయన సగర్వంగా ప్రకటించారు. దేశంలో అన్ని పార్టీలు కార్పొరేట్ స్వామ్యానికి దాసోహం అన్న ఈ దశలో సైతం తమ విధానాలకు అనుకూలంగా నిలబడి చిత్తశుద్ధి చాటిన వామపక్షాల ఘనతను జనం గుర్తించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. బీజేపీ సర్కార్ తమలక్ష్యాలను సాధించుకోవడం కోసం ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నదని, సిఏఏ, ఎన్ ఆర్ సి లాంటివి ఈకోవ కిందికి వస్తాయని, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇది నా మతం అనే పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టివేయబడ్డారని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు గతా నివేదికను ప్రవేశపెట్టారు. సమావేశానికి నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యులు యల్లావుల రాములు మేకల శ్రీనివాసరావు యల్లంల యాదగిరి ధూళిపాళధనుంజయ నాయుడు, కంబాల శ్రీనివాస్ పోకల వెంకటేశ్వర్లు దేవరం మల్లీశ్వరి బూరవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
.
Spread the love