అన్ని దానాల కంటే రక్తదానం మహా గొప్పది: డీఎంహెచ్ఓ

– ధర్మారం లో ప్రపంచ రక్త దాతల దినోత్సవం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
అన్ని దానాల కంటే రక్తదానం మహా గొప్పదని దీన్ని వేల కట్టలేనిదని ఆపదలో ఉన్న సమయంలో ఈ రక్తం ఎంతగానో తోడ్పడుతుందని డీఎంహెచ్వో తుకారం రాథోడ్ అన్నారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి గ్రామంలో సూర్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్త దాన శిబిరంను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. తుకారాం రాథోడ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ముఖ్యంగా యువత రక్త దానం చేయడాన్ని అలవాటు చేసుకుంటే అది అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు, గర్భిణీ స్త్రీలకు, ప్రమాదాలలో గాయపడ్డ వారి విలువయిన ప్రాణాలను కాపాడుతుందని, అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ను అధిక బరువును, గుండె జబ్బులను నియంత్రిస్తుందని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.సూర్య ఆరోగ్య సంస్థ వారు ప్రజలను చైతన్య పరుస్తూ రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీ యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తూకారం రాథోడ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  యువకులు గ్రామస్తులు తరలివచ్చి 42 యూనిట్ల రక్తం ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్య ఆరోగ్య సంస్థ ఛైర్మన్ ఉదయ సూర్య భగవాన్ చేకూరి,సంస్థ ప్రతినిధులు కె రామకృష్ణ, పి నాగేశ్వర రావు, రాజేంద్ర కుమార్ విక్రమ్, ప్రశాంత్, వినోద్, డి పి ఎమ్ సుధాకర్,ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ – ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాద్ జి వాసు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love