
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని తాడిచెర్ల గ్రామపరిదిలోని కాపురంపల్లిలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు గత నాలుగు రోజులు వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఈ కార్యక్రమానికి ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి,మైన్ సీనియర్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తీ హాజరయ్యారు.ప్రతిష్టాపన ఉత్సవాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ బొడ్రాయిని ప్రతిష్ఠించారు. బొడ్రాయి అగ్ని ప్రతిష్ఠాపర, చండీహోమం, బొడ్రాయి ఊరేగింపు, అభిషేకం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.గ్రామంలో ఉన్న పెద్ద,చిన్న అందరూ మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు.