సన్న వడ్లకు బోనస్ వెంటనే ఇవ్వాలి 

– బీఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్ 
నవతెలంగాణ -తాడ్వాయి 
ఎన్నికల హామీలో భాగంగా సన్న వడ్లు పండించిన రైతులకు కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్న కాంగ్రెస్ సర్కార్, వెంటనే రైతులకు బోనస్ రైతుల అకౌంట్లో వేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్ డిమాండ్ చేశారు. గురువారం లేఖర్లతో మాట్లాడుతూ.. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పిందని మండిపడ్డారు. మండలంలో ఎక్కడనో ఒక కాడ మొదలు పంపిన కొద్ది మంది రైతులకే పడ్డాయని, ఇప్పటివరకు మండలంలోని ఎక్కువమంది రైతులకు సన్న వడ్ల బోనస్ పడలేదని ఆయన ఆవేదన చెందారు. ధాన్యం అమ్మిన వెంటనే బ్యాంక్ ఖాతాలో బోనస్ వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సుమారు రెండు నెలలు కావస్తున్న ఇప్పటికీ రైతులకు బోనస్ డబ్బులు పడలేదని మండిపడ్డారు.  రైతు రెక్కలు ముక్కలు చేసుకుంటూ సన్న వడ్లు పండించారని, కింటాకు రూ. 500 బోనస్ అంటే కష్టం మిగులుతుందని ఆశపడ్డామని అన్నారు. బోనసు పేరు చెప్పి ఓట్లు ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు వెంటనే బోనస్ చెల్లిస్తామని, రెండు రోజుల్లో  బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని సాక్షాత్ ముఖ్యమంత్రి మాట ఇచ్చారని ఆయన అన్నారు. కానీ అవన్నీ మాయమాటలేనని వడ్లు విక్రయించాక నెలలో తరబడి ఎదురుచూస్తున్న బోనస్ డబ్బులు మాత్రం వేయడం లేదని మండిపడ్డారు. వెంటనే ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ పెద్దలు స్పందించి సన్నవోడ్లు పండించిన రైతులకు బోనస్ పైసలు వెంటనే వేయాలని డిమాండ్ చేశారు.
Spread the love