
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు త్రిష సహకారంతో ఆందోల్ మండల పరిధిలోని కొడేకల్ గ్రామ పరిధిలోని ఎస్సీ కాలనీలో నూతనంగా బోరు మోటర్ పనులు ప్రారంభించి, బోరు నీటి సౌకర్యం కల్పించారు. గురువారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ లు కె రాజేశ్వర్ గౌడ్, జి. శ్రీనివాస్ రెడ్డి, ఎలిషా, గ్రామ అధ్యక్షుడు పి వీరారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. మాణిక్యం, కే. మైపాల్ రెడ్డి, ఏ. వీరేశం, ఎం. సుధాకర్ కుమార్, లక్ష్మణ్ లు బోరు ప్రారంభించారు. దీంతో కాలనీకి చెందిన మహిళలు నీటిని పట్టుకొని వెళ్లారు. త్రిష దామోదర్ తమకు నీటి సౌకర్యం కల్పించినందుకు గ్రామస్తులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.