
మండలంలోని జంగంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు ఉన్న కారణంగా సాయంత్రం సమయంలో అల్పాహారం అందించడానికి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బాల్ నర్సవ్వ రామస్వామి ముందుకు వచ్చి అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.