
నవతెలంగాణ – బెజ్జంకి
20న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్వర్యంలో నిర్వహించనున్న మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కనగండ్ల తిరుపతి గురువారం పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం పంక్షన్ హాల్ యందు నిర్వహిస్తున్న అలాయ్ బలాయ్ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హజరవుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హజరవ్వాలని తిరుపతి కోరారు.