బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మళ్లీ రావాలి…

 – కేసీఆరే గేలవాలి
చౌటుప్పల్ డివిజన్ లీగల్ సెల్ ఇంచార్జీ గంగాదేవి రవీందర్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసి ఢిల్లీ పెద్దలను ఒప్పించి ఇక తప్పదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మార్గమే శ్రేయస్కరం అనే పరిస్థితి తీసుకువచ్చి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటామని గురువారం గంగాదేవి రవీందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి  తద్వారా యువతకు ఉపాధి కల్పన, యువ ఇన్నోవేటర్స్ కు ఇంజనీరింగ్, విద్యార్థుల సృజనాత్మకతకు, వ్యవసాయదారులకు, పరిశ్రమలకు, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించే విద్యుత్తును సరిపడా అందించాలని కంకణం కట్టుకొని 24 గంటల కరెంటును తీసుకువచ్చి అందించిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా ఇంటింటికి మంచినీరు అందించి కుటుంబ బాధలను తీర్చి, ఊరి ఊరికి రోడ్లను, పల్లె-వీధులలో కూడా సి.సి రోడ్లను ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళామణుల సమయాన్ని ఆదా చేసి, రహదారులను ఏర్పాటు చేసి, తద్వారా అందరి సమయాన్ని ఆదా చేసి, వ్యవసాయ దారులకు అన్ని రకాల సహాయ సహకారాలను ఆర్థిక సహాయాలను అందిస్తూ, కాలువల నీటిని మళ్లిస్తూ, భూగర్భ జలాలను పెంచేలా చర్యలు చేపట్టారు. అందులో సత్ఫలితాలు సాధించారు. మత్స్యకారులకు ముదిరాజులకు, నాయిబ్రాహ్మణ, రజక, పద్మశాలి కులవృత్తులకు చేయూతనిచ్చారు. మన కేసీఆర్ సారు.. పెట్టుబడిదారులను ఆకర్షించి పారిశ్రామిక రంగాలను ఐటీరంగ సంస్థలను ప్రోత్సహిస్తూ పుట్టిన పిల్లవాడి నుండి మొదలుకొని మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు పథకాలను ప్రవేశపెట్టి, పెన్షన్లను కూడా అందిస్తున్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో మన తెలంగాణలోని యువతి-యువకుల తెలివి, జ్ఞానం, శ్రమశక్తితో బ్రతికేలా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లను ఏర్పాటు చేశారు! ఆధ్యాత్మికతను, దేవాలయాల అభివృద్ధి మొదలుకొని ఐటీ రంగ సంస్థలను, పరిశ్రమలను అభివృద్ధి చేసి తెలంగాణ మోడల్ ను మన దేశానికి చూపించారు. ఇలాంటి సుమధుర, సుందర భవిష్యత్తు కలిగిన తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని భవిష్యత్తులో తెలంగాణ ప్రజల, యువతియువకుల ఉపాధి, తెలివి, జ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం, శ్రమశక్తితో తెలంగాణ అభివృద్ధికి,  ప్రపంచ దేశాలకు విస్తరించేలా బంగారు బాటలు వేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మళ్లీ రావాలి… మునుగోడుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా కావాలి. మనం అందరం కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్‌ నే మళ్లీమళ్లీ గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని అని యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ డివిజన్ లీగల్ సెల్ ఇంచార్జీ, న్యాయవాది గంగాదేవి రవీందర్ తెలిపారు.
Spread the love