బీఆర్ఎస్ కు అపూర్వ స్పందన వస్తోంది..

 – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు.
 – జిల్లా రైతుబంధు సభ్యుడు కోడి వెంకన్న
నవతెలంగాణ – చండూరు: చండూర్ మున్సిపల్ పట్టణంలో  ప్రచారంలో కి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ కి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, బీఆర్ఎస్ అభ్యర్థి   ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని  జిల్లా రైతుబంధు సభ్యుడు, కౌన్సిలర్  కోడి వెంకన్న అన్నారు.  శనివారం చండూరు మున్సిపాలిటీలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గృహలక్ష్మి, బిసి బంధు పథకాలు నిరంతరాయంగా కొనసాగే పథకాలని, అర్హులందరికీ దఫాల వారీగా లబ్ధి చేకూరుతుందని వివరించారు. సీఎం కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు అడగకముందుకే అన్ని చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ  సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇప్పటికే చండూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొండ్రెడ్డి యాదయ్య, నాయకులు రావిరాల నగేష్, పున్న సైదులు, చిలుకూరి శ్రీనివాసులు, కర్నాట శ్రీనివాస్, గుర్రం రాము, గంజి వేణు, పున్న వెంకటేశం, ఏశాల వీరేశం, మేడిపల్లి శంకర్, చలమల లక్ష్మయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.
Spread the love