
నవతెలంగాణ- నకిరేకల్: ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని నకిరేకల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం నకిరేకల్ మున్సిపాలిటీలోని 17, 18, 19, 20వ వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. మూడోసారి ఎన్నికల బరిలో ఉన్న తనను ప్రజలు ఆశీర్వదించి మరోమారు అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నకిరేకల్ నియోజకవర్గ పేద ప్రజలందరికీ మెరుగైన అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు రూ.32 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ప్రతి గ్రామంలో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతుబంధు. ఉచిత కరెంటు వంటి పథకాలు అమలు చేస్తున్నారని. సంక్రాంతి తర్వాత సౌభాగ్య లక్ష్మీ, పింఛన్ల పెంపు అమలు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ వస్తే అంధకారం, సంక్షేమాలు అందవని, ప్రతి ఒక్కరు అభివృద్ధి. సంక్షేమం కోసం కేసీఆ ఆర్ ను గెలిపించాలని కోరారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాయని, ప్రజలు గమనించి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో షీప్ అండ్ గోట్ కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్. |నలగాటి ప్రసన్నరాజ్, చెరుకు లక్ష్మీ పాల్గొన్నారు.