కావేరి సీడ్స్‌కు బంఫర్‌ లాభాలు

కావేరి సీడ్స్‌కు బంఫర్‌ లాభాలుహైదరాబాద్‌ : ప్రముఖ విత్తన కంపెనీ కావేరీ సీడ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 13.77 శాతం వృద్థితో రూ.96.12 కోట్ల రెవెన్యూ సాధించినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.84.40 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. ఇదే సమయంలో రూ.2.72 కోట్లుగా ఉన్న నికర లాభాలు.. గడిచిన క్యూ2లో 2.94 రెట్లు పెరిగి రూ.10.72 కోట్లకు చేరాయి. 2023-24 తొలి ఆరు మాసాల్లో కంపెనీ రెవెన్యూ 5.75 శాతం పెరిగి రూ.863.42 కోట్లుగా.. 14.45 శాతం వృద్థితో రూ.278.56 కోట్ల లాభాలు ఆర్జించింది. అన్ని రకాల ప్రధాన విత్తన విభాగాల్లో మెరుగైన వృద్థిని సాధించామని కావేరీ సీడ్స్‌ సీఎండీ జివి భాస్కర్‌ రావు పేర్కొన్నారు.

Spread the love