
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం, హాలియ మున్సిపాలిటీ నందు రామాలయంలో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం మరియు హనుమాన్ శక్తి జాగరణ సమితి వారి ఆహ్వానం మేరకు మాన్యశ్రీ అఖండ నిష్టాపరులు శ్రీ శ్రీ శ్రీ అరుణ్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో, ధీక్షలో వున్న అయ్యప్పస్వాములు 41 రోజుల అన్నదాన కార్యక్రమం ముగింపు సందర్భంగా గురువారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వారిని అయ్యప్ప స్వాములు ఘన సన్మానం చేశారు.తదనంతరం స్వాములు మహా పడిపూజ కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి,మేడిపల్లి మోహన్ రావు, రాయప్రోలు మురళి కృష్ణ, రేపాల వెంకన్న, మైనారిటీ సెల్ అధ్యక్షుడు నయీమ్ పాష, వివియస్ ప్రసాద్,కాకునూరి శ్రీను, కాకునూరి నారాయణ, మణికంఠ, ఇస్రం లింగస్వామి, అనుముల కోటేష్, గజ్జల నాగార్జున రెడ్డి, గడ్డం సజ్జన్, అబ్దుల్ కరీం, కొంపల్లి మూడవ వార్డు మెంబర్ జినకల యాదయ్య, మధు, గాలి నరేందర్ రెడ్డి, స్వాములు చందా అంజిరెడ్డి, అల్గుల పూజిత శ్రీనివాస రెడ్డి, గౌరు శ్రీనాధ్ మరియు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.