వచ్చే ఏడాది చివరిలో లేదా …

– బంగ్లాదేశ్‌ ఎన్నికలపై తాత్కాలిక నేత యూనస్‌ కీలక ప్రకటన
ఢాకా : బంగ్లాదేశ్‌ ఎన్నికలపై ఆ దేశ ప్రధాన సలహాదారు ముహమ్మద్‌ యూనస్‌ సోమవారం కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది చివరలో గాని, 2026 ప్రారంభంలో గాని సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. జాతినుద్దేశించి సోమవారం ఆయన టెలివిజన్‌లో ప్రసంగిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025 చివరినాటికి లేదా 2026 ప్రథమార్థంలో ఎన్నికల తేదీలను నిర్ణయించవచ్చన్నారు. అయితే ఈ ఎన్నికల్లోగా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టాల్సి వుందని అన్నారు. ఎటువంటి లోపాలు, లొసుగులు లేని ఓటరు జాబితాలను రూపొందించడంతో సహా పలు సంస్కరణలతో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు అంగీకరిస్తే 2025 నవంబర్‌ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించవచ్చని అన్నారు. ఎన్నికల సంస్కరణల కమిషన్‌ సిఫార్సు అదనపు సంస్కరణలు చేపట్లాంటే మరో ఆరు మాసాలు సమయం కావాల్సి వుంటుందన్నారు. కాబట్టి 2026 మొదటి ఆరు మాసాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు వుంటాయని స్పష్టం చేశారు.

Spread the love