సోషల్‌ మీడియాకు బైబై

Bye bye to social media– 2025 నాటికి 50 శాతానికి పైగా వినియోగదారులు దూరం
–  గార్ట్‌నర్‌ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా నేటి ప్రజలపై ఎంతగానో ప్రభావం చూపుతున్నది. అనేక మంది ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, స్నాప్‌చాట్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలను చూడనిది తమ రోజును గడపలేకపోతున్నారు. అయితే, స్వేచ్ఛ అధికంగా ఉండే ఈ సామాజిక మాధ్యమానికి వినియోగదారులు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, విషపూరితమైన వినియోగదారు స్థావరాలు, బాట్‌ల ప్రాబల్యం కారణంగా 50 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు 2025 నాటికి సోషల్‌ మీడియాతో తమ పరస్పర చర్యలను వదులుకోవటం, గణనీయంగా పరిమితం కావటం వంటివి చేయనున్నారు. ఈ విషయాన్ని గార్ట్‌నర్‌ తన సర్వేలో వెల్లడించింది. సర్వే సమాచారం ప్రకారం.. 53 శాతం మంది వినియోగదారులు గత సంవత్సరం లేదా ఐదేండ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుత సోషల్‌ మీడియా స్థితి క్షీణించిందని నమ్ముతున్నారు. ”డిజిటల్‌ మార్కెటింగ్‌ కోసం సోషల్‌ మీడియా టాప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఛానెల్‌గా ఉన్నది. అయితే వినియోగదారులు తమ వినియోగాన్ని పరిమితం చేయటానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారు” అని గార్ట్‌నర్‌ మార్కెటింగ్‌ ప్రాక్టీస్‌లో సీనియర్‌ ప్రిన్సిపల్‌ రీసెర్చర్‌ ఎమిలీ వీస్‌ అన్నారు.

Spread the love