ఉత్సాహంగా ఉల్లాసంగా రంగుల పండగ 

నవతెలంగాణ – గోవిందరావుపేట 
రంగుల పండుగ హోలీని మండల వ్యాప్తంగా శుక్రవారం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రజలు జరుపుకున్నారు. ఉదయం నుండే యువత విద్యార్థులు మహిళలు పిల్లలు రంగులు చల్లుకుంటూ హోలీ సందడి చేశారు. రకరకాల రంగులతో రహదారుల పొడవునా పరుగులు తీస్తూ ఒకరినొకరు సరదాగా రంగులు పూసుకున్నారు. కూలీని పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నలు పిల్లలు సైతం ఒకరినొకరు రంగులు పూసుకోవడం ఎంతో ఆకర్షించింది. మద్యం షాపులు మూసివేసినప్పటికీ బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యం లభించింది. ముందు రోజు ఎస్ఐ హెచ్చరికలు ఏమాత్రం పనిచేయలేదు. యువత మద్యం మత్తులో రంగులు పూసుకునే ఈత సరదా కోసం ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందారు. ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు అందరూ ఒకరినొకరు ఎలాంటి తారతమ్యం లేకుండా రంగుల పండుగ సందడి చేశారు.
Spread the love