
– ఎంఈఓ ఎనగందుల కొమరయ్య
నవతెలంగాణ – రామగిరి
పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా మండల వ్యాప్తంగా 100% హాజరుతో ముగిశాయని రామగిరి మండల ఎంఈఓ ఎనగందుల కొమరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ తెలుపుతూ, పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 294 మంది బాలురు, 134 మంది బాలికలకు సంబంధించి 160 మంది రామయ్యపల్లి విద్యార్థులు మంథనిలో పరీక్ష రాస్తున్నారని, అలాగే సుందిళ్ల పాఠశాల విద్యార్థులు గోదావరిఖనిలో, చందనాపూర్, వెంకట్రావు పల్లె, పాఠశాల విద్యార్థులు 8వ కాలనీలోనీ సింగరేణి పాఠశాలలో ఎగ్జామ్ రాశారని తెలిపారు. మిగతా పాఠశాల విద్యార్థులు రామగిరి మండలంలో ఉన్న వాణి పాఠశాల సెంటర్లో 229 మంది పరీక్షకు హాజరయ్యారని, మొదటిరోజు ఎవరు ఆబ్సెంట్ కాలేదని, తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందనీ ఆయన తెలిపారు.