మోపాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని  వివిధ గ్రామాలలో గల ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి  బిఆర్ఎస్ నాయకుడు జెడ్పిటిసి కమల నరేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కి ఓటు వేయాలని మన రూరల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ బాజిరెడ్డి అని ఆయనని గెలిస్తే మన నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి మన రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కూడా ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచించే మనిషిని అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల తరపున పోరాడే ఏకైక వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ అని ఈసారి జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో గోవన్నకి పట్టం కట్టాలని నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోచ్చ శ్రీనివాస్, న్యాల్కల్ శ్రీనివాసరావు, మంచిప్ప మాజీ సర్పంచ్ ఇందూరి సిద్ధార్థ, ముత్యం రెడ్డి, భూమయ్య,తదితరులు పాల్గొన్నారు.
Spread the love