ఘనంగా ప్రెసిడెన్సి ఉన్నత పాఠశాల 28వ వార్షికోత్సవం

నవతెలంగాణ – మోపాల్
ప్రెసిడెన్సి ఉన్నత పాఠశాల 28వ వార్షిక దినోత్సవ వేడుకలను భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మరియు టాయ్ ప్రెసిడెంట్ రాజీవ్ దువా  హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ దువా  మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాలల్లో చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఎంతో నైపుణ్యాన్ని పొందుపరచుకుంటారని అలాగే ఈ విధంగా విద్యార్థులకు కృషి చేస్తున్న పాఠశాల యజమాన్యానికి, చైర్మన్ నల్ల శమంత, ప్రధానోపాధ్యాయులు శ్రీ పవన్ కి ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో  ముందుకెళ్లాలని, చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలలో  కూడా మంచి పట్టుండాలని ఆయన తెలిపారు. మీ పాఠశాలలో చదువుతోపాటు సంస్కృత కార్యక్రమాలు కూడా మీకు నేర్పిస్తున్నందుకు పాఠశాల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులందరూ చెడు మార్గంలో పయనించకుండా మంచి నడవడికతో ఉంటూ మీరు చదువుతున్న పాఠశాలకు మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు. అలాగే  కలెక్టర్ చేతుల మీదగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు మెడల్స్, బహుమతులను అందించారు. అలాగే జిల్లా ఒలంపిక్ సెక్రెటరీ శ్రీ బబ్బిలి నర్సయ్య  చేతుల మీదగా జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు సన్మానిస్తూ ఆయన చేతుల మీదగా సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. శనివారం మరియు ఆదివారం రెండు రోజులు ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు స్టాల్స్ ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రావ్య, డిన్ మహేష్ ,ఇన్నోవేషన్ టీమ్ ఇంచార్జ్ శ్రీ చరణ్, హెచ్ఆర్ కృపా నిధి, మరియ ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love