నగదు రహిత వైద్యాన్ని అందించాలి

నవతెలంగాణ –  కంటేశ్వర్

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎలాంటి  వాటా (కంట్రిబ్యూషన్) లేకుండా నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేటు, వైద్యశాలలో ఎలాంటి సీలింగు లేకుండా అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని  తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పెన్షనర్లను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసిందని ఫలితం అనుభవించిందని ఆయన అన్నారు.  డి ఏ ల విడుదల, పి ఆర్ సి తదితర దీర్ఘకాలంగా పెండింగ్ లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే సంఘాలతో  సంప్రదింపులు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘ నిర్మాణం, ఈపీఎఫ్ పెన్షనర్ల కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా మార్కెట్ కమిటీలలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు గత మూడు నెలలుగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలలో పెన్షన్ చెల్లించలేదని, మార్కెట్ కమిటీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు శాస్త్రుల  దత్తాత్రేయరావు ,జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు ,ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ కోశాధికారి ఈవిల్ నారాయణ , ఉపాధ్యక్షులు  లావు వీరయ్య, భోజరావు, జాయింట్ సెక్రెటరీ లక్ష్మీనారాయణ, అశోక్, ఈపీఎస్ పెన్షనర్ల జిల్లా కన్వీనర్ అద్దంకి ఉషాన్,  రాధా కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love