నేర నియంత్రణకు సీసీ కెమెరాలు తోడ్పడతాయి 

నవతెలంగాణ-గోవిందరావుపేట 
 నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో జామా మసీదులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమలాకర్ ప్రారంభించి మాట్లాడారు. సిసి కెమెరాలు నేర నియంత్రణలో  కీలక పాత్ర పోషిస్తాయని, మీ పరిసర ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు  చేసుకోవడం వల్ల అనుమానాస్పద వ్యక్తుల కదలికలను  గుర్తించేందుకు ఇవి  చాలా ఉపయోగకరమని,  మసీదు  లొ, కెమెరా ఏర్పాటు చేసుకోవడం  అభినందనీయం అని, మండలంలోని, అన్ని గ్రామాల్లో, ప్రధాన కూడళ్లలో, గ్రామాల్లోని ప్రతి షాపుల ముందు ,  సిసి  కెమెరాలు పెట్టుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని, కమలాకర్  తెలిపారు, ఈ సి సి కెమెరాల ఏర్పాటులో , మండలంలోని ప్రజలు, వ్యాపారస్తులు, యువత, సహకరించాలని తెలిపారు.
Spread the love