ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-గోవిందరావుపేట : రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ 48వ జన్మదిన వేడుకలను బుధవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లాకావత్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ నాయక్ మాట్లాడుతూ నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగములో కేరాఫ్ అడ్రస్ గా మార్చిన ఘనత  కేటీఆర్  దే అని అన్నారు. కేటీఆర్ ముందు ముందు పార్టీని మరింత అభివృద్ధి పరిచి భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో  ఆలూరి శ్రీనివాసరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు అక్కినపల్లి రమేష్,  ఎండి బాబర్, చుక్క గట్టయ్య , సీనియర్ నాయకులు డాక్టర్ హేమాద్రి, సీనియర్ నాయకులు లకావత్ చందులాల్, అజ్మీర సురేష్,  ఉట్ల మోహన్, దర్శనాల సంజీవ, బై కానీ ఓదెలు, , అల్లం హనుమంతరావు ఎస్ రవీందర్ రావు,కే కృష్ణ, ఇంద్రారెడ్డి, జి కనకయ్య, ఆర్ శ్రీనివాస్, S భద్రయ్య, వెంకన్న,కృష్ణారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు,
Spread the love