
– రక్త హీనత పై అవగాహన
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ ఎం ఎం అంగన్వాడి సెంటర్లో గురువారం అంగన్వాడీ టీచర్ సరిత ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, వైద్య శాఖ సిబ్బంది, గ్రామస్తులతో కలిసి ఘనంగా పోషణ సంబరాలు నిర్వహించారు. అనంతరం చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు.
గర్భిణీలకు, చిన్నపిల్లలకు రక్తహీనత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి తల్లి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యమే ఐసిడిఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. చిరుధాన్యాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, ప్రతీ గ్రామంలో ప్రజలెవరూ పిల్లలు, మహిళలు పోషణాలోపం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు అందరూ సహకరించాలని, పరిశుభ్రత పాటించాలని అన్నారు. అనంతరం. చిరుధాన్యాలు గురించి పిల్లలకు అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నవలోక, తల్లులు, పిల్లలు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.
