పెద్దవూరలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, స్థానిక పోలీస్ స్టేషన్,తహసీల్దార్,ఎంపీడీ ఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీలు,విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఆయా కార్యా లయాలలో అధికారులు, భారత్ త్రివర్ణ పథాకాన్ని ఎగుర వేశారు.తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ సరోజ పావని, ఎంపీడిఓ కార్యాలయం లో ఎంపీపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, మహిళా సమాఖ్య కార్యాలయం లో ఏపీఎం లలిత, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వీరబాబు, ట్రాన్సకో కార్యాలయం లో ఏఈ దాసయ్య, పీఏసీఎస్ కార్యాలయం లో ఛైర్మెన్ గుంటుక వెంకట రెడ్డి, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బారత మువ్వన్నెల జెండాను ఎగుర వేశారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ వర్కాల మోహన్ రెడ్డి,ఫిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి,బీఆర్ఎస్ మండలం అధ్యక్షులు జాటావత్ రావినాయక్, జిల్లా బీ ఆర్ ఎస్ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్,ఎంపీటిసి పులిమాల కృష్ణారావు,మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య, మాజీ మార్కెట్ చైర్మెన్ నడ్డి లక్షయ్య,తదితరులు పాల్గొన్నారు.
Spread the love