మానసిక ఆరోగ్యంపై సెల్‌ఫోన్‌ ప్రభావం

Effect of cell phone on mental healthబాల్య దశలో మానసిక వికాసం Childhood Psychological Development):
చిన్న వయసులో సెల్‌ఫోన్‌ వినియోగం కారణంగా పిల్లలు క్రియాశీలంగా నడుచుకోవడం తగ్గిపోతుంది.
కాగ్నిటివ్‌ వికాసం: ఏకాగ్రత కోల్పోవడం, సమస్యలను పరిష్కరించడంలో అంతరాయం కలుగుతుంది.
భావోద్వేగ నియంత్రణ: చిన్న విషయాలకు కూడా ఆవేశంగా మారడం, దఢమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

సమాజంలో భాగస్వామ్యం లేకపోవడం(Social Isolation):
పిల్లలు సెల్‌ఫోన్‌ వినియోగం వల్ల కుటుంబం, స్నేహితులతో సంబంధాలు బలహీన పడతాయి.
ఎమోషనల్‌ బాండ్‌: కుటుంబంతో సమయం గడపకపోవడం వల్ల ఎమోషనల్‌ బలహీనత ఏర్పడుతుంది.
సమాజం నుంచి దూరం: తోటివారితో సంభాషణ తగ్గడం, ఒంటరితనం పెరగడం.

సెల్‌ఫోన్‌ దుర్వినియోగం ఫలితంగా మానసిక సమస్యలు (Psychological Disorders):
నోమోఫోబియా (Nomophobia): సెల్‌ఫోన్‌ లేకపోతే భయాందోళనకు గురవడం.
డిప్రెషన్‌ మరియు ఆందోళన: అసమర్థత భావనతో దీర్ఘకాలిక డిప్రెషన్‌.
సైకోటిక్‌ భ్రాంతులు: వాస్తవికతను పసిగట్టడంలో విఫలం కావడం.

సెల్‌ఫోన్‌ వినియోగానికి న్యూరోబయాలజికల్‌ ప్రభావం(Neurobiological Impact):
డోపమైన్‌ ఓవర్‌స్టిమ్యులేషన్‌: సోషల్‌ మీడియా, గేమ్స్‌ వల్ల తక్షణ ఆనందం పొందటంతో, ఇతర విషయాల్లో ఆసక్తి తగ్గిపోవడం.
స్లీప్‌ డిస్టర్బెన్స్‌: నిద్రాభంగం వల్ల మెదడులో ఎమోషనల్‌. మెమరీ ఇష్యూస్‌.

పెద్దల పాత్ర(Parental and Educational Guidance):
తల్లిదండ్రులు పిల్లలకు అనువైన మార్గదర్శకత్వం అందించకపోవడం.
పాఠశాలల వైఫల్యం: పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పాఠశాలల్లో గుర్తించి తగిన సలహాలు అందించడంలో వెనుకబాటు.
పరిష్కార మార్గాలు(Intervention Strategies):

– డిజిటల్‌ డిటాక్స్‌: పిల్లల సెల్‌ఫోన్‌ వినియోగాన్ని పరిమితం చేయాలి.
– కౌన్సెలింగ్‌: పిల్లలు, తల్లిదండ్రులు మానసిక ఆరోగ్యంపై అవగాహన పొందేలా కార్యక్రమాలు నిర్వహించాలి.
– క్రియాశీల సమాజం: పిల్లలకు ఆటలు, కళలు, శారీరక వ్యాయామాలపై దష్టి సారించే అవకాశాలు ఇవ్వాలి.
– సెల్‌ఫోన్‌ వినియోగం అనేది మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపించే సాధనం. దీన్ని సమర్థంగా ఉపయోగించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం చురుకైన పాత్ర పోషించాల్సి ఉంది.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love