కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ –  మునుగోడు
కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందని సీపీఐ( ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శనివారం మండల కేంద్రంలో సీపీఐ( ఎం) కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం పై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అణిచివేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. కేరళలో విపత్తులు, కష్టకాలంలో కూడా సహాయం చేయకుండా కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. ఎల్ డి ఎఫ్ ప్రభుత్వాన్ని అన్ని విధాల ఆటంకాలు కలిగిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. కేరళ ప్రభుత్వం ఆదాయం ఉత్పత్తి లో ముందంజలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన సంక్షోభం ఏర్పడిందన్నారు. 2021- 22 లో కేరళ రుణ పరిమితి తగ్గించిందని అన్నారు. జీఎస్టీ వంటి ఆదాయ వనరును తగ్గించిందని అన్నారు. ప్రతిపక్ష నేతలపై ఈడి ,సిబిఐ ,ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లను ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలలో కేంద్రం జోక్యం చేసుకొని  దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ జోక్యం చేసుకొని మితిమీరి వ్యవహరించడం ,ప్రభుత్వ పని విధానం పై  ప్రభావం పడుతుందని అన్నారు. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం విద్విశ్ పూరిత వైఖరి అవలంబించడం సరికాదని ఇది మేధావులు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ( ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్ , సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు , మండల కమిటీ సభ్యులు యాసరాని శ్రీను , వేముల లింగస్వామి , బొందు అంజయ్య , సాగర్ల మల్లేష్ ,యాసరాని వీరయ్య , మేడి రాములు తదితరులు ఉన్నారు.
Spread the love