సిమ్ కార్డులకు కేంద్రం కొత్తరూల్స్…

నవతెలంగాణ హైదరాబాద్: సిమ్‌ స్వాప్‌ లేదా మార్పిడి తర్వాత మొబైల్‌ నంబర్‌ పోర్టింగ్‌కు (MNP) అర్హత పొందేందుకు ఏడు రోజుల నిరీక్షణ సమయం ఉంటుందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) వెల్లడించింది. ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది. మొబైల్‌ ఫోన్‌ నంబర్ల వినియోగించి జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ట్రాయ్‌ ఈ చర్యలు చేపట్టింది. ఇంతకు ముందు సిమ్‌ స్వాప్‌ చేసిన సందర్భంలో నిరీక్షణ సమయం 10 రోజులుగా ఉండగా.. తాజా సవరణలో దాన్ని ఏడు రోజులకు తగ్గించింది. దీంతో ఇకపై ఏడు రోజుల్లోగా నంబరు మార్చుకునేందుకు యూనిక్‌ పోర్టింగ్‌ కోడ్‌ (UPC)ను కేటాయించారు. సిమ్‌ స్వాప్‌ తర్వాత 10 రోజుల నిరీక్షణ సమయం ఎక్కువని పలు సంస్థలు అభిప్రాయపడగా, 10 రోజుల నిరీక్షణ సమయం వల్ల చందాదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మరికొన్ని సంస్థలు వెల్లడించాయి. 2-4 రోజుల సమయం సరిపోతుందని తెలిపాయి.

Spread the love