సరిహద్దు అటవీ ప్రాంతంలో సెంట్రల్ పోలిస్ బలగాలు 

– అంబులెన్స్ తో సహా, వాహనాల నిలుపుదల
– భయభ్రాంతులతో సరిహద్దు గ్రామాల ప్రజలు, దామరతోగు గ్రామ ప్రజలు
నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలోని దామరతోగు గ్రామ సమీపంలోని చెర్లగుట్ట అటవీ ప్రాంతంలో బుధవారం సెంట్రల్ పోలిస్ బలగాలు ముమ్మరంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతానికి ఒక్కసారిగా రెండు డిసియం వాహనాలు, ఒక ఎర్టిక కారు, బోలోర  వాహనాలు, ఒక అంబులెన్స్ రావటంతో సరిహద్దు గ్రామాల ప్రజలైన వీరాపూర్, రంగాపూర్, బీరెల్లి, దామరతోగు, సాయినిపెళ్లి గ్రామాల ప్రజలతో పాటు, అటువైపు వెళ్ళే ప్రయనీకులు ప్రాణాలు గుప్పిల్లో పెట్టుకోని తిరుగుతున్నారు. ఎప్పుడు రాని వాహనాలలో అ గ్రామనికి పోలిసులు రావడంతో ఆ గుట్ట వద్ద ఏం జరుగుతుంది అని భయబ్రాంతులకు గురవుతున్నారు. తాడ్వాయి పోలీస్ అధికారులను వివరణ అడగగా మన పరిధి కాదు, మాకు సమాచారం తెలియదు అని తెలిపారు. కొందరు మీడియా మిత్రులు సంఘటన ప్రాంతానికి వెల్లగా ఒక పోలీస్ అధికారి మేము సెంట్రల్ పోలీస్ కూబింగ్ నిర్వహిస్తున్నాము, ఫోటోలు తీయరాదు, అవసరమైతే సాయంత్రం ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని అన్నారు. ఆ గుట్ట ప్రాంతంలో 108 వాహనం ఉండడంతో ఏం జరిగిందో, ఈ పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి ? తెలియక, ఇంకెవరికన్న తీవ్ర గాయాలయ్యాయి అని, ఏది ఏమైనప్పటికీ, ఏ సమయంలో, ఏం జరుగుతుందో అని ఆ పరిసర ప్రాంతాల ఆదివాసి గుడాల ప్రజలు  భయ బ్రాంతులకు గురవుతున్నారు.
Spread the love