
మండలం అధికారి ఎంఈఓ చంద్రశేఖరు బుధవారం పలు గ్రామాలలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఆయన సందర్శించారు. రాయిచెడు, గువ్వలోనిపల్లి, పెనిమెల్ల, లతీపూర్ పాఠశాలలను సందర్శించి రికార్డులను పరిశీలించి విద్యార్థులా విద్య ప్రమాణాలు పరిశీలించారు. ఉపాధ్యాయులు సకాలంలో విధులు నిర్వహించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.