హుస్నాబాద్ లో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన గ్రంథాలయ భవనానికి మరో రూ.30 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని వాటితో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి త్వరలో గ్రంథాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా గజ్వేల్, దుబ్బాక, మీరుదొడ్డి లలో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు, సాహితీ వేత్తలకు గ్రంధాలయాలు అన్ని విధాలుగా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ, రిటైర్డ్ ఉద్యోగులు, రచయితలు, మేధావులు గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.