నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రం లో కాంగ్రేస్ పార్టీ యూత్ విభాగం ఆధ్వర్యంలో గురువారం నాడు ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ స్థానిక కాంగ్రేస్ నాయకులతో కలిసి ప్రారంబించారని మండల కాంగ్రేస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వార్ వినోద్ , రమేష్ దేశాయి తెలిపారు. ఈ సంధర్భంగా ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతూ.. ఎండలు మండి పోతున్నాయి గ్రామీణ ప్రజలు మండల కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగీస్తుం టారు. కనీసం అవసరంగా గుర్తించి ప్రజల దహర్తీ తీర్చాలనే ఉద్దేశంతో కాంగ్రేస్ పార్టీ యూత్ విబాగం సబ్యులు మంచి ఉద్దేశంతో సేవలందిస్తున్నందుకు అభినందనియమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెలే తో పాటు కాంగ్రేస్ పార్టీ యూత్ విభాగం నాయకులు, మండలస్థాయి ప్రజాప్రతినిధులు రమేష్ దేశాయి, నాయకులు సాయి, కృష్ణ, తుకారాం తదితరులు పాల్గోన్నారు.