నవతెలంగాణ – కామారెడ్డి : ఈ నెల 14న హైదరాబాద్‌లో నిర్వహించనున్న నిరుద్యోగ పోరు దీక్ష” ను విజయవంతం చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మికార్ వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో విద్యార్థి సేన ఆధ్వర్యంలో దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నిరాశపరిచిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగ పోరు దీక్షలో జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు గౌస్ పాషా, చందు, నోమన్, శ్రీకాంత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
చలో ధర్నా చౌక్..నిరుద్యోగ పోరు దీక్షను విజయవంతం చేయండి : విద్యార్థి సేన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


