ప్రస్తుతం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ని ఆశీర్వదించి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంతో పాటు మండలంలోని వెల్వర్తి, ఆరూర్, ప్రొద్దటూరు గ్రామాలలో ఇంటింటీ ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతో కృషిచేస్తుందని, పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేశారని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వo వస్తే రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తుందని అన్నారు. భువనగిరి ఎంపీగా ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ని ఆదరించి అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో పలువురి చేరిక
మండలంలోని రెడ్లరేపాక కు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం లక్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ మాద లావణ్య శంకర్ తో సుమారుగా 50 మoది బిఆర్ఎస్ కార్యకర్తలు, అక్కంపెల్లి మధిర సాయిరెడ్డి గూడెం కు చెందిన గూడూరు నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు, వెల్వర్తికి చెందిన ముదిరాజ్ సంగం లక్ష్మీబాయి 100 మంది, వలిగొండకు చెందిన బిఆర్ఎస్ నాయకులు ఐటిపాముల రవి ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది కార్యకర్తలు, వేములకొండ ఎంపిటిసి సామ రాం రెడ్డి ఆధ్వర్యంలో 20 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు మరి కొంత మంది కార్యకర్తలు స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమా రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తి రెడ్డి, వాకిటి అనంతరెడ్డి,గుఱ్ఱం లక్మారెడ్డి, బాథరాజు బాల నర్సింహా, గూడూరు శివశాంత్ రెడ్డి, తుమ్మల యూగందర్ రెడ్డి, బోళ్ల శ్రీనివాస్ ,నోముల మల్లేష్, బట్టిని సహదేవ, సోలిపురం సాగర్ రెడ్డి, కంకల కిష్టయ్య, ఎమ్మె లింగ స్వామీ, పల్లెర్ల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు,