
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రభుత్వాలు మారుతున్న సామాన్య ప్రజల స్థితిగతులు మాత్రం మారడం లేదని ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వాలు అండగా ఉంటు విద్య, వైద్యం అందించాలని నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అగ్రకులాల పాలనలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాలు మారడం లేదన్నారు. వారికి విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు కల్పించడంలో విఫమయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఏమి చేయని ప్రభుత్వాలు ఉన్న ఒక్కటే లేకున్న ఒకటేనని అన్నారు. జీవించే హక్కు కల్పించిన రాజ్యాంగం కూడా సామాన్యులకు వసతులు కల్పించాలని చెబుతోందన్నారు. అందుకే పేదల పక్షన ధర్మసమాజ్ పార్టీ అండగా ఉంటూ ఉద్యమిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చీటి వెంకటేష్, బోథ్ మండల అధ్యక్షులు కె గణేష్, అధ్యక్షులు రాజేశ్వర్, బజార్హత్నూర్ అధ్యక్షులు నరేష్, అదిలాబాద్ అర్బన్ అద్యక్షులు సంతోష్, ఉట్నూర్ – అరవింద్,ఆయా మండలాల నాయకులు నవీన్, రమేష్, తరుణ్ , సంతోష్, లక్ష్మణ్, సుధాకర్, రాథోడ్ నరేందర్, వినోద్, సాయి, స్వామి ,గంగన్న,ప్రేమ్, ప్రమోద్, ఒమన్న, రవి,గంగాధర్, జగదీష్, హరిప్రసాద్, పాల్గొన్నారు.