నవతెలంగాణ -తిరుమలగిరి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పేరుతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును రాష్ట్రం నుండి సాగనంపాలని తుంగతుర్తి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి కడియం రామచంద్రయ్య అన్నారు. ఆయన తిరుమలగిరి మండలంలో బుధవారం బండ్లపల్లి, గుండెపురి, ఈదులపర్రే తండా, నీలిబండ తండా గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని,డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని గతంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా తుంగలో తొక్కారని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హాయంలో ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ, ఉచిత గ్యాస్ పంపిణీ,సబ్సిడీపై ఎరువుల పంపిణీ, దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం, సిమెంట్ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు విధిగా అభివృద్ధి చేశారని చెప్పారు. గ్రామపంచాయతీలను ఆర్థికంగా అభివృద్ధి చేశారని గ్రామ పంచాయతీలకు విరివిగా అభివృద్ధి కలిపించారని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యము, వృద్ధ దంపతులకు పెన్షన్లు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. తుంగతుర్తి స్థానికుడైన నన్ను గెలిపిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని చెప్పారు. అనంతరం గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, మాజీ సర్పంచ్ ఏపూరి పద్మ తో పాటు వందమంది బిజెపి పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మల్లెపాక సాయిబాబా, కూరాకుల వెంకన్న, దీన్ దయాల్, మేడబోయిన యాదగిరి, వేల్పల బంగారు స్వామి, నాగయ్య, హనుమంతు యాదవ్, చిలుక అశోక్, ఈదునూరు సుభాష్ రెడ్డి, ఈదునూరు జ్యోతి, పగిళ్ల శంకర్, ధరావత్ దేవేందర్, ధరావత్ బిక్షపతి, వెంగల్ తదితరులు పాల్గొన్నారు.