చర్మం, జుట్టు సమస్యలకు చెక్‌

Check for skin and hair problemsమన దేశంలో సీతాఫలం విరివిగా దొరికే అద్భుతమైన, రుచికరమైన పండు… అందులోనూ ప్రస్తుత చలికాలంలో ఇది సీజనల్‌ ఫ్రూట్‌ కూడానూ.. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, ప్రొటీన్లు, పొటాషియం, ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఈ పండు శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. సీతాఫలం జీర్ణక్రియ, కంటి, గుండె ఆరోగ్యానికి అవసరం. అంతే కాకుండా సీతాఫలం ఆకుల్లో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులోని పోషకాలు చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. ఈ ఆకులలో విటమిన్‌ ఎ, సి వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అకాల వద్ధాప్యాన్ని నివారిస్తాయి. ఇది ఫేషియల్‌ లైన్స్‌ తగ్గించడంలో, స్కాల్ప్‌ ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
ఆకుల ప్రయోజనాలు :
– యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
– సీతాఫలం ఆకుల్లో సహజసిద్ధమైన క్లెన్సింగ్‌ గుణాలు ఉన్నాయి.
ఆకులతో తయారు చేసుకునే ప్యాక్‌ చర్మం నుండి మురికి, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది.
– ఆకుల పేస్ట్‌ లేదా లిక్విడ్‌ వాటర్‌ కూడా చర్మాన్ని రిఫ్రెష్‌ చేయడానికి సహాయపడుతుంది.
– చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది.
– ఈ కాలంలో చర్మం పొడిబారిపోయి ఉంటుంది. దీన్ని హైడ్రేట్‌ చేయడానికి సీతాఫలం ఆకులను ఉపయోగించవచ్చు. అంతేకాదు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
– జుట్టు పెరుగుదలకు సీతాఫలం ఆకుల హెయిర్‌ ప్యాక్‌ వేసుకుంటే, జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది.
– ఈ ఆకులు హెయిర్‌ ఫోలికల్స్‌ను బలోపేతం చేయడంతోపాటు స్కాల్ప్‌ను హెల్తీగా మార్చేందుకు ఉపయోగపడతాయి.
– ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. చుండ్రు నివారిస్తుంది.
– సీతాఫలం ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా జుట్టు మూలాలు బలంగా తయారవుతాయి.
– జుట్టుకు సహజ నూనెలు అందుతాయి. దీన్ని రెగ్యులర్‌ గా ఉపయోగించడం వల్ల చుండ్రు తగ్గడం ప్రారంభమవుతుంది.
చర్మానికి సీతాఫలం ప్యాక్‌
సీతాఫలం ఆకులను రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని చెంచా రోజ్‌ వాటర్‌ కలపండి. అందులోనే అలోవెరా జెల్‌ని మిక్స్‌ చేసి చర్మంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. ప్యాక్‌ ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడగాలి.
హెయిర్‌ మాస్క్‌
సీతాఫలం ఆకులను రుబ్బుకోవాలి. దానికి ఒక చెంచా పెరుగు కలపాలి. ఒక నిమ్మకాయ రసం ఈ పేస్టుకు యాడ్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని బాగా మిక్స్‌ చేసి జుట్టుకు పట్టించాలి. దీనిని జుట్టుపై సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును నీటితో కడిగేయాలి.

Spread the love