– వాకర్స్లో పెరుగుతున్న ఉత్సాహం
– ఉరుకుల పరుగుల జీవితంలో నడకకు ప్రాధాన్యం
– పట్టణాలతోపాటు పల్లెల్లోనూ వాకింగ్
– సంపూర్ణ ఆరోగ్యమంటున్న వైద్యులు
నవతెలంగాణ – మల్హర్ రావు
పార్కులో షటిల్ ఆడుతున్న, వాకర్స్ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయస్సులోనే అనుకొని రోగాల బారినపడు తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా…ఆయుష్షు పెరగాలన్న ప్రతిరోజూ నడ వడమే మేలని చెబుతున్నారు వైద్య నిపుణులు. నడకతో పాటు తేలికపాటి వ్యాయామం కూడా అవసరమని సూచిస్తున్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా.. ప్రజలు వాకింగ్పై దృష్టి పెట్టారు
మండలంల్ ఎక్కువగా ప్రధాన రహదారులపై ఉదయం,సాయంత్రం వేళలో వాకింగ్ చేస్తూ ఉంటారు. దీంతో తెల్లవారక ముందే రోడ్లు, మైదానాలు సందడిగా మారుతున్నాయి. పల్లె, పట్నమనే తేడా లేకుండా వాకింగ్ లతో దర్శసమిస్తున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ, వర్షంలో సైతం నడుస్తున్నారు. ఆరోగ్యం కోసం, అలసట నుంచి విముక్తి కోసం శ్రమిస్తూనే ఉన్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల శరీరం. రోగాల పుట్టగా మారుతుంది. ఇలాంటి తరుణంలో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. ఉదయమే లేస్తున్నా జాలువారుతున్న పొగ మందులో ఆరోగ్యంతోపాటు ఆహ్లాదాన్ని వెతుక్కుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా, చిన్నా, పెద్ద, పురుషులు, మహిళలు, వృద్ధులు వాకింగ్ చేస్తున్నారు. తమ ఆరోగ్యం కోసం తీరిన సమయం లో ఒక గంట కాళ్లకు పని చెబుతున్నారు.:ఉరుకుల పరుగుల జీవితం.. కాలంతో పోటీ పడుతూ సాగే జీవనం.. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్చి వస్తుంది.
గంటపాటు చేస్తే మేలు..మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు
నేను కొన్నేళ్ల నుంచి వాకింగ్ చేస్తున్నాను. ఆర్యోగంగా ఉండడం కోసం ఒక గంటపాటు కాళ్లకు పని చెబుతున్నాను. ఎటు వంటి అనారోగ్య సమస్యలు వాకింగ్తో నయం చేసుకోవచ్చు. నడకతో కండరాలు బలోపేతం అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తుం ది. నరక సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రజల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా పార్కులు, కాల్వ గట్లపై నడిస్తే మంచిది.
వాకింగ్తో సంపూర్ణ ఆరోగ్యం..విక్రాంథ్ సింగ్.. ప్రముఖ వైద్య నిపుణులు
ప్రస్తుతం ప్రజలు క్షణం తీరిక లేని సమయం గడుపుతు న్నారు. అయినప్పటికీ నడక తప్పనిసరి చేస్తేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. వివిధ అనారోగ్య సమస్యలను కొంత వరకు తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులు ఉన్న వారు వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎమ ర్జెన్సీ ఫోన్ నబర్లను దగ్గర పెట్టు కోవాలి. వాకింగ్ చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరగాలి. చెమట పట్టేటట్లు చేయాలి..