మంత్రి కోమటిరెడ్డిని కలిసిన చేగురి మల్లేశం

నవ తెలంగాణ – వలిగొండ రూరల్
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు  సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో టేకుల సోమారానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చేగురి మల్లేశం మర్యాదపూర్వకంగా కలిసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ అభివృద్దికై నిధులు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించి త్వరలోనే గ్రామానికి వచ్చి గ్రామాభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేగూరి జంగయ్య, యువజన కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి చేగూరి బాలు ఉన్నారు.
Spread the love