బస్టాండ్ ప్లాట్ ఫాంకి చెర్లంకిరెడ్డిపల్లి గ్రామం పేరు 

నవతెలంగాణ – చిన్నకోడూరు 
సిద్దిపేట పాత బస్టాండ్(మోడర్న్ న్యూ బస్టాండ్) లో ఒక ప్లాట్ ఫాం పైన సపరేట్ గా చెర్లంకిరెడ్డిపల్లి ఊరు పేరు ఉండాలనే ఎన్నో ఏళ్ల కల నేటికీ బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ తో సాకారం వల్ల నెరవేరిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా యువ నాయకులు అజ్జు యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులను పొన్నం ప్రభాకర్ కి తెలియజేసిన అతి తక్కువ సమయంలో ఫ్లాట్ ఫాం పై గ్రామ పేరు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గ్రామస్థులు ప్రతి ఒక్కరూ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి  ప్రభాకర్ సూచించారు.
Spread the love