నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా బీసీ 42 శాతం పెంచినందుకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు తూర్పు రాజులు, కామెల్లి బాలరాజ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లైన్ రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంఘని బాబా, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బిసా గణేష్, వివిధ విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు