Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.రైతు భరోసా 5 ఎకరాలకు నిధులు విడుదల చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. రైతు భరోసన్నిధులు విడుదల చేసినందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  మాజీ అధ్యక్షులు సుంకేట రవి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేలా ప్రవీణ్,  మాజీ జిల్లా నాయకులు తక్కురి దేవేందర్,  హాసకొత్తూరు సర్పంచ్ నలిమేల గంగారెడ్డి, మండల ఉపాధ్యక్షులు కుంట ఆనంద్, బాల్కొండ నియోజక యూత్ మాజీ ఉపాధ్యక్షలు మేడిపల్లి రీత్విక్, టౌన్ అధ్యక్షులు సల్లూరి గణేష్, చౌట్ పల్లి అధ్యక్షులు రవీందర్, బషీరాబాద్ అధ్యక్షులు నర్రా భూమేష్,  మండల యూత్ ఉపాధ్యక్షులు శైలేందర్, మండల కోశాధికారి బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, బాలయ్య,  రాజేందర్,  వన్నెల దేవేందర్, సంజీవ్, నరేష్,  జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -