నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న పలువురు అనాధ, తల్లి లేక తండ్రిని కోల్పోయిన విద్యార్థులకు అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ మేరకు శనివారం బాలికల విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అక్షిత ఫౌండేషన్ చైర్మన్ రాపాక సన్నీ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్షిత ఫౌండేషన్ చైర్మన్ రాపాక సన్నీ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న అనాధ, తల్లి/తండ్రిని కోల్పోయిన విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలలో భాగంగా చేయూతనందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సేవాకార్యక్రమానికి సహకరించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిణి గంగామణికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాలయం ఉపాధ్యాయులు హెచ్.వీణ, వి.కౌసల్య, జి.సునీత, పి.స్వప్న, పి.సరిత, ఎన్.శ్రీలత,ఎం.ప్రీతీ, అకౌంటెంట్ మంజుల, ఏఎన్ఎం జ్యోతి, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బ్యాగుల అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



