నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా ప్రయాణాల పట్ల చైనీయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల నెలకొన్న పరిస్థితుల రీత్యా యూఎస్ వెళ్లే చైనీయులకు పలు ఆటంకాలు కలుగవచ్చని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ప్రతీకార సుంకాల పేరుతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధంలో..చైనా దూకుడు పెంచిన విషయం తెలిసిందే. తమ దేశానికి వచ్చే చైనా ఉత్పత్తులపై ఏకంగా 104శాతం టారిప్ విధించారు ట్రంప్. దీంతో అమెరికా చర్యను అదేస్థాయిలో చైనా ప్రతిఘటించింది.. యూఎస్ దిగుమతులపై ఏకంగా 84శాతం సుంకాలు విధించింది జీన్ పింగ్ ప్రభుత్వం. దీంతో ఇరుదేశాల మధ్య ట్రేడ్ వార్ ముదిరింది. సుంకాల పెంపు విషయంలో చైనా, అమెరికా ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే పలు దేశాలపై విధించిన టారిఫ్ అమలు విషయంలో 90రోజులకు వాయిదా వేసింది అమెరికా. కానీ చైనా దేశానికి ఎలాంటి మినహాయింపు లేదని పేర్కొంది.