వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా చింతల నాగరాజు

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ జిల్లా కార్యదర్శి నరసింహ సమక్షంలో ఉప్పునుంతల మండలం కంసాన్ పల్లి గ్రామానికి చెందిన చింతల నాగరాజు ను జిల్లా సహాయ కార్యదర్శిగా  జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీల సమస్యల పట్ల జిల్లా వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేసి వారి సమస్యలను అధ్యయనం చేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం రోజుకు 600 రూపాయల చొప్పున కూలి చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని ప్రదేశాలలో అనివార్యంగా ప్రమాదాలు జరిగితే 50 లక్షల ఎక్స్గ్రేసన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
Spread the love