క్రీస్తు సందేశం ప్రపంచ మానవాళికి అనుసరణీయం మేరీ మదర్ పాఠశాల

నవతెలంగాణ- తుంగతుర్తి
ప్రపంచంలోని అన్ని దేశాలు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్, ప్రేమ దయా కరుణ జాలి క్రీస్తు సందేశం అని, క్రీస్తు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని మండల కేంద్రంలోని మేరీమదర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ విజ్జి అన్నారు. గురువారం పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి మాట్లాడారు.క్రీస్తు జన్మదినం అందరికీ పవిత్రమని,యేసు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించాడని,ప్రభువైన యేసు మానవాళికి ఆదర్శనీయుడని అన్నారు. అందరూ క్షమాగుణం,సేవా భావం, మానవత్వం కలిగి ఉండాలన్నారు. క్రీస్తు దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని,కుల మతాలకు అతీతంగా మెలగాలని అన్నారు. ఏసుక్రీస్తు బోధనలు అనునిత్యం అనుసరించదగిన మార్గదర్శకాలని అన్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో మేనేజర్ అలేసియా, వైస్ ప్రిన్సిపాల్ మేరీ రిన్సీ, ఫాదర్ జయంత్, పాస్టర్ యాకూబ్, సిస్టర్ హెలెన్, సిస్టర్ జ్యోతి, సిస్టర్ మరియ,స్టాఫ్ సెక్రటరీ అనిత, వైస్ సెక్రటరీ అశోక్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
Spread the love